60 ఏళ్ల బామ్మతో 22 ఏళ్ల యువకుడు ప్రేమ..!

423
60yr Woman
- Advertisement -

ప్రేమకు వయసుతో సంబంధం లేదు.. అది ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో తెలియదు. ప్రేమకు కులం.. మతం.. భాష.. ప్రాంతంతో పనిలేదు. అయితే ఇప్పుడు మీరు చదవబోయే ఓ లవ్‌ స్టోరీ వింటే మతిపోవాల్సిందే. 60 ఏళ్ల బామ్మ.. 22 ఏళ్ల యువకుడి ప్రేమలో నిండా మునిగిపోయింది. ఎవరు అడ్డొచ్చినా తమను వేరుచేయలేరని ఇద్దరూ బాసలు చేసుకున్నారు. అయితే బామ్మ భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆ ముసలాయన చెప్పింది విన్న పోలీసులకు షాక్‌కు గురైయ్యారు.

వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాకు చెందిన ఓ ఆరవై ఏళ్ల బామ్మకు ఏడుగురు పిల్లలు ఏడుగురు మనవళ్లు ఉన్నారు. రెండు నెలల క్రితమే అమ్మమ్మ కూడా అయ్యింది. కాగా వాళ్లింటికి దగ్గరలోనే ఓ యువకుడు నివసిస్తున్నాడు. రోజూ బామ్మ ఇంటికి వెళ్లి వస్తూండటంతో.. బామ్మపై యువడికి ప్రేమ చిగురించింది. ఇంకేముంది.. బామ్మకు ప్రపోజ్ చేశాడు. కట్ చేస్తే ఇద్దరూ వీరి ప్రేమకు ఎవరూ ఒప్పుకోరని గ్రహించి పారిపోదామనుకున్నారు.

అయితే వీరిద్దరి తీరునూ.. పసిగట్టిన ఆ బామ్మ భర్త.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అదే సమయంలో తన కుటుంబ సభ్యులతో యువకుడు కూడా వచ్చాడు. దీంతో ఇరువైపుల వారు ఘర్షణ పడ్డారు. దీంతో యువకుడిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. విషయం సోషల్ మీడియాకు ఎక్కడంతో విపరీతంగా వైరల్ అవుతోంది. తర్వాత ఏం జరగబోతోందన్న దానిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.

- Advertisement -