- Advertisement -
ట్రాఫిక్ చలాన్ల చెల్లింపుకు పోలీసులు ఇచ్చిన బంపర్ ఆఫర్‌కు విశేష స్పందన వస్తోంది. 6 రోజుల్లో 60 లక్షలకు పైగా చలాన్లు క్లియర్ అయ్యాయి. ప్రభుత్వ ఖజానాలో సుమారు రూ.70 కోట్లు చేరాయి.
ఈ నెల 31 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉండగా ద్విచక్రవాహనాలు 25 శాతం ,కార్లు, లైట్ మోటార్ వెహికల్స్‌కు 50 శాతం, ఆర్టీసీ బస్సులకు 70 శాతం, తోపుడు బండ్లకి 80 శాతం రాయితీ కల్పించారు.
మార్చి1న 8 లక్షల చలాన్లు,మార్చి2న 15 లక్షల చలాన్లు, మార్చి 3న 16 లక్షల చలాన్లు, మార్చి4న 15 లక్షల చలాన్లు, మార్చి 5, 6వ తేదీల్లో కొద్దిగా కట్టే చలాన్లు తగ్గాయి. మొత్తంగా ఆరు రోజుల్లో 60 లక్షలకు పైగా చలాన్లు క్లియర్ అయ్యాయి.
- Advertisement -