బాహుబలికి ఆరేళ్లు..!

145
baahu bali
- Advertisement -

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన చిత్రం బాహుబలి. రెండు పార్టులుగా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పింది. ప్రభాస్‌ సరసన అనుష్క హీరోయిన్‌గా నటించగా రానా కీ రోల్ పోషించారు. విమర్శకుల ప్రశంసలు పొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టి ఇప్పటివరకు ఉన్న భారతీయ సినిమా రికార్డులన్నింటిని తిరగరాసింది. బాహుబలి విడుదలై ఆరు సంవత్సరాలు గడిచిన సందర్భంగా అభిమానులు సోషల్ మీడియాలో సినిమా పిక్స్‌ని షేర్ చేస్తూ విషెస్ చెబుతున్నారు.

దాదాపు నాలుగు సంవత్సరాల పాటు సినిమా షూటింగ్ జరుగగా సినిమా విడుదలైన తర్వాత చిత్రయూనిట్ పడిన కష్టాన్ని మొత్తం మర్చిపోయింది.ప్రభాస్, రానా అద్బుత నటనకు తోడు విజువల్ గ్రాఫిక్స్, సెంటిమెంట్, ఫైట్స్, పాటలు ఇలా ప్రతిఒక్కటి సాధారణ ప్రేక్షకులకు దగ్గరయ్యేలా తెరకెక్కించారు జక్కన్న. సినిమా రిలీజ్‌కు ముందే క్రియేట్ అయిన హైప్‌కు ఏమాత్రం తీసిపోకుండా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది.దాదాపు రూ. 3 వేల కోట్ల వసూళ్లను రాబట్టింది. ముఖ్యంగా బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనే లాజిక్‌పై తెగ చర్చకూడా జరిగింది.

అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలిగా ప్రభాస్ ద్విపాత్రాభినయం చేయగా రానా భ‌ళ్ళాల‌దేవుడిగా, అనుష్క దేవ‌సేన‌గా, ర‌మ్య‌కృష్ణ రాజ‌మౌత శివ‌గామిగా, స‌త్య‌రాజ్ క‌ట్ట‌ప్పగా, త‌మ‌న్నా అవంతిక పాత్ర‌ల‌లో నటించి మెప్పించారు.

- Advertisement -