క్లైమాక్స్‌కు వరుణ్‌ తేజ్…. గని!

153
varun tej
- Advertisement -

మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గని. వరుణ్ కెరీర్‌లో మొట్టమొదటి స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతోండగా తాజాగా సినిమాకు సంబంధించి మరో అప్‌డేట్ వచ్చేసింది. సినిమా ఫైనల్ షూటింగ్ ప్రారంభమైందని…ఈ షెడ్యూల్‌లో క్లైమాక్స్ బాక్సింగ్ ఎపిసోడ్‌ని చిత్రీకరించనున్నారని చిత్రయూనిట్ వెల్లడించింది.

ఇక సినిమా షూటింగ్ దశలో ఉండగానే డిజిటల్, శాటిలైట్ రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయాయి. తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’… ‘గని’ డిజిటల్, శాటిలైట్ రైట్స్‌ని 24 కోట్లకు కొనుగోలు చేసింది. వరుణ్ తేజ్ పాన్-ఇండియా చిత్రానికి ఇది భారీ భారీ మొత్తమనే చెప్పాలి. అల్లు బాబీ, సిద్ధూ ముద్దా నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా వరుణ్ తేజ్ సరసన హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ నటిస్తోంది. సునీల్ శెట్టి, ఉపేంద్ర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ఈ సినిమా కోసం బాక్సింగ్ లో ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు వరుణ్ తేజ్. అంతేకాదు తన పాత్రకు తగినట్లుగా తన శరీరాన్ని మార్చుకున్నాడు.

- Advertisement -