6రబీ పంటలకు కనీస మద్దతు ధరను పెంచిన:కేంద్రం

195
- Advertisement -

2022-23రబీ సీజన్‌కు 6రకాల పంటలపై కనీస మద్దతు ధరను పెంచింది. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన మంగళవారం జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలను కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ మీడియాకు వెల్లడించారు. 2022-23పంట సీజన్, 2023-24 మార్కెటింగ్‌ సీజన్‌కు ఆరు రబీ పంటల కనీస మద్దతు ధరను పెంచినట్టు అనురాగ్‌ ఠాకూర్‌ తెలిపారు.

రబీ సీజన్‌లో ప్రధాన పంటలైన గోధుమ, నువ్వులు, శనగలు, మసూర్‌, బార్లీ, కుసుమ పంటలకు ఎంఎస్‌పీ పెంచారు. అత్యధికంగా మసూర్‌కు ధరను క్వింటాల్‌కు రూ.500పెంచినట్లు కేంద్ర మంత్రి వివరించారు.

వివరాలు (ఒక క్వింటాల్‌కు) ఇలా ఉన్నాయి:

  • గోధుమల కనీస మద్దతు ధరను రూ.110పెంచారు. దీంతో రూ.2125 కు చేరింది.
  • బార్లీ ధరను రూ.100 పెంచగా…రూ.1735కు పెరిగింది.
  • శనగల కనీస మద్దతు ధర రూ.5230 నుంచి రూ.5335కు పెరిగింది.
  • మసూర్‌ పంట మద్దతు ధరను రూ.500 పెంచడంతో రూ. 6000కు చేరింది.
  • నువ్వులకు రూ.5050 నుంచి రూ. 5450కు పెరిగింది.
  • కుసుమ పంట మద్దతు ధరపై రూ.209పెంచారు. దీంతో రూ.5650కు పెరిగింది.
- Advertisement -