- Advertisement -
ప్రకృతి బీభత్సానికి టర్కీ అతలాకుతలం అవుతోంది. ఇప్పటికే సంభవించిన భూకంపంతో వేల సంఖ్యలో మృత్యువాత పడగా తాజాగా మరోసారి భూకంపం టర్కీని వణికించింది. ఒకటి కాదు రెండు కాదు గంటల వ్యవధిలోనే 32 సార్లు భూమి కంపించడంతో ఏం జరుగుతుందో తెలియక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
నిన్న రాత్రి మొదలైన ప్రకంపనలు కంటిన్యూగా కొనసాగుతున్నాయి. దీంతో ప్రాణ భయంతో పరుగులు తీశారు ప్రజలు. తాజా ప్రకంపనలకు మరో ముగ్గురు బలవ్వగా 213 మంది గాయాల పాలయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
మొదటి భూకంపం భూమికి 16.7 కిలో మీటర్ల లోతులో సంభవించగా, రెండో భూకంపం భూమికి 7 కిలో మీటర్ల లోతులో సంభవించినట్లు అధికారులు గుర్తించారు.
ఇవి కూడా చదవండి..
- Advertisement -