డ్రంకన్ డ్రైవ్‌లో పట్టుబడ్డ నటుడు దాసరి అరుణ్ కుమార్..

70
- Advertisement -

డ్రంకన్ డ్రైవ్‌లో సినీ నటుడు దాసరి అరుణ్ కుమార్ పట్టుబడ్డారు. ఆయన మద్యం సేవించి వాహనం నడిపినట్లు పోలీసులు గుర్తించారు. ఈమేరకు దాసరి అరుణ్‌పై కేసు నమోదు చేసి.. హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇక వివరాల్లోకి వెళ్లితే.. దాసరి అరుణ్ కుమార్ బుధవారం తెల్లారుజామున రోడ్ నెంబర్ 12 సయ్యద్ నగరలో తన కారులో ప్రయాణిస్తూ ద్విచక్ర వాహనాలను ఢీ కొట్టాడు.

దీంతో స్థానికులు బంజారాహిల్స్ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గురువారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో అరుణ అదుపులోనికి తీసుకున్నారు. ఉస్మానియా ఆసుపత్రికి తరలించి పరీక్షలు నిర్వహించగా మద్యం సేవించి వాహనం నడిగినట్టు గుర్తించారు పోలీసులు. దాసరి అరుణ్ కుమార్‌పై డ్రంకన్ డ్రైవ్ act 1988 ఐపిసి section 185 & 304 కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున పోలీసులు.

- Advertisement -