ఒక ఫ్యామిలీని పోషించాలంటే చాలా కష్టపడాల్సిన వస్తుంది. అయితే ఓ వ్యక్తి ఏకంగా 550మందికి తండ్రి అయ్యారు. ఎలాగాంటారా మీరే చదవండి..!నెదర్లాండ్స్‌కు చెందిన జోనథాన్ ఎ అనే వైద్యుడు..వీర్యదానం ద్వారా 550మంది పిల్లలకు తండ్రిఅయ్యారు.
ది హేగ్ నగరంలో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు ప్రపంచమంతటా చర్చనియాంశమైంది. ఇప్పటివరకు నెదర్లాండ్స్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా 13క్లినిక్‌లలో వీర్యదానం చేశారు. అయితే నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి 12కుటుంబాలకు మాత్రమే వీర్యదానం చేయాలి. వీర్యదానం ద్వారా జోనాథాన్ 100మందికి పైగా చిన్నారులకు జన్మనిచ్చారని 2017లోనే తెలిసింది.
కానీ ఇతను విదేశాల్లో ఉంటూ ఆన్లైన్ ద్వారా వీర్య దానం చేసినట్టు ప్రాథమిక నిర్దారణ వచ్చారు. దీంతో ది డచ్ సొసైటీ ఆఫ్ అబ్ట్సెట్రిక్స్ అండ్ గైనకాలజీ ఇతన్ని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది. ఇతన్నిపై వీర్యదానం చేయకుండా అడ్డుకోవాలని పేర్కొంటూ ఓ మహిళ కోర్టుల్లో కేసు వేశారు. దీంతో మరోసారి వార్తాల్లో నిలిచారు. ప్రస్తుతం ఇతన్ను కెన్యాలో ఉన్నట్టు నెదర్లాండ్స్ మీడియా వెల్లడించింది.
ఇవి కూడా చదవండి…