53% మందికి ఉచిత బియ్యం పంపిణీ..

34
53% Distribute Free Rice:Srinivas Reddy

శుక్రవారం నాటికి 46.69 లక్షల (53%) మంది కార్డుదారులకు 1 లక్ష 81 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని, 1275 మెట్రిక్ టన్నుల కందిపప్పును పంపిణీ చేయడం జరిగిందని పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

యాసంగిలో గురువారం (6వ తేదీ) సాయంత్రం నాటికి పౌరసరఫరాల సంస్థ 6255 కొనుగోలు కేంద్రాల ద్వారా 5.78 లక్షల మంది రైతుల నుంచి రూ. 5,826 కోట్ల విలువైన 33.38 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. ఇందుకు సంబంధించి రూ. 2,815 కోట్లను రైతుల ఖాతాలో జమ చేయడం జరిగిందన్నారు.