ఆర్థిక సేవలు మొబైల్ బ్యాంకింగ్ దిగ్గజం బ్లాక్ సంస్థ వ్యవస్థాపకుడు జాక్ డోర్సే సంపద ఆవిరైంది. అమెరికాకు చెందిన ఈ కంపెనీ..హిండెన్ బర్గ్ నివేదిక వెలువడిన వెంటనే బ్లాక్ షేర్లు భారీ ఎత్తున పతనమయ్యాయి. దీంతో డోర్సే సంపదలో సూమారుగా 526మిలియన్ డాలర్లు(రూ.4327కోట్లు) ఆవిరయ్యాయి. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం..ఆయన సంపద 11శాతం తగ్గి 4.4బిలియన్‌్ డాలర్లకు చేరింది. ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడైన డోర్సే సంపదలో అత్యధికంగా ఉన్న బ్లాక్ షేర్ విలువ భారీగా పతనమయ్యాయి. గతంలోనే హిండెన్‌బర్గ్ తన నివేదికను త్వరలో వెల్లడిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే.
హిండెన్‌బర్గ్ నివేదికలో ఖాతాదార్ల సంఖ్యను ఎక్కువగా చూపుతూ సంస్థ షేరు విలువను కృత్రిమంగా పెంచుకుంటూ పోవడం వల్ల మీరు పెట్టుబడిదార్లను ప్రభుత్వాన్ని మోసగించారన్నది ఆరోపణ. బ్లాక్ వినియోగదారుల్లో ఎక్కువమంది నేరస్థులు అక్రమ వ్యాపారులు నిర్వహించే వారు ఉన్నారని పేర్కొంది. ఈసంస్థలో ఎక్కువగా 40 నుంచి 75శాతం ఖాతాలు నకిలీవని ఆ సంస్థ మాజీ ఉద్యోగులు తమకు వెల్లడించినట్లు హిండెన్ బర్గ్ తెలిపిందే. అయితే జనవరి 24న విడుదలైన అదానీ గ్రూప్ నివేదిక వల్లే అదానీ మార్కెట్ విలువ 140బిలియన్ డాలర్లకు ఆవిరైపోయాయి. అయితే అప్పటినుంచి దేశంలో రాజకీయంగా పెను దూమారం రేపింది.
ఇవి కూడా చదవండి…