దేశంలో 24 గంట‌ల్లో 5233 క‌రోనా కేసులు

30
covid case
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వ‌ల్పంగా పెరిగాయి. గ‌త 24 గంట‌ల్లో 5233 కేసులు న‌మోదుకాగా 7 గురు మృతిచెందారు. దీంతో మొత్తం కేసులు 4,31,90,282కు చేరగా 4,26,36,710 మంది బాధితులు క‌రోనా నుండి కోలుకున్నారు.

ప్ర‌స్తుతం దేశంలో 28,257 కేసులు యాక్టివ్‌గా ఉండ‌గా ఇప్పటివరకు 5,24,715 మంది మృతిచెందారు. రోజువారీ పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటంతో యాక్టివ్‌ కేసులు 0.07 శాతానికి చేరాయి. రికవరీ రేటు 98.72 శాతం, మరణాల రేటు 1.21 శాతంగా ఉంది.

- Advertisement -