టీఆర్ఎస్ నేత, విశ్రాంత ఉపాధ్యాయుడు బిల్లా సోమిరెడ్డి అంత్యక్రియల్లో పాల్గొన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. జనగామ జిల్లా దేవరుప్పుల మండల పరిధి కామారెడ్డిగూడెంలో అంత్యక్రియల్లో పాల్గొన్న ఎర్రబెల్లి….సోమిరెడ్డి పాడె మోశారు. మాస్టారు సేవలు మరువలేనివంటూ కన్నీటి పర్యంతమయ్యారు.
చివరి వరకు మాస్టారి పాడె మోసి ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
ఈ సందర్భంగా వారి కుటుంబసభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. తాను పాలకుర్తి నియోజకవర్గంలో అడుగు పెట్టినప్పటి నుంచి వెన్నంటి ఉండి రాజకీయ సూచనలు, సలహాలు ఇచ్చారని గుర్తుచేశారు.
మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో మంగళవారం మంత్రి మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్ నేతలు సర్పంచులను రెచ్చగొడుతున్నారన్నారు. కరోనా మూలంగా మూడేళ్లు కొత్త పెన్షన్లు, . ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధికి నోచుకోని తెలంగాణ గ్రామాలు నేడు పల్లె ప్రగతితో అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములై, తమ తమ గ్రామాలను తీర్చిదిద్దుకోవాలని పిలుపునిచ్చారు.

