- Advertisement -
కోవిడ్ వ్యాక్సిన్‌పై కీలక ప్రకటన చేసింది సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. కరోనాకు చెక్ పెట్టేందుకు ఆక్స్‌ఫర్డ్‌తో కలిసి పనిచేస్తున్న సీరమ్ భారతీయులకు గుడ్ న్యూస్ చెప్పింది.
తాము ఉత్పత్తి చేసే ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్లలో 50 శాతం.. భారత్, కోవ్యాక్స్లకే కేటాయిస్తామని సీరం సీఈవో అదర్ పూనావాలా తెలిపారు. 2021 జూలై నాటికి 30 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసులను ఉత్పత్తి చేస్తామని వెల్లడించారు.
జనవరి ఫస్ట్ వీక్‌లో యూకేలో ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్‌కు అనుమతులు లభించవచ్చని, ఆ వెంటనే భారత్‌లోనూ గుడ్‌న్యూస్ వింటామనే ఆశాభావం వ్యక్తం చేశారు.
- Advertisement -