రాష్ట్రంలో 24 గంటల్లో 397 కరోనా కేసులు..

30
covid

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 397 కరోనా కేసులు నమోదుకాగా ఇద్దరు మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,85,465కి చేరుకున్నాయి.

ప్రస్తుతం రాష్ట్రంలో 5,999 యాక్టివ్ కేసులుండగా 2,77,931 మంది కరోనా మహమ్మారి నుండి కోలుకున్నారు. ఇప్పటివరకు కరోనాతో 1,535 మంది మృతిచెందారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 97,93,691 కరోనా టెస్టులు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.