రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు..

566
telangana
- Advertisement -

రాష్ట్రప్రభుత్వం భారీగా ఐఏఎస్‌ల బదిలీలు చేపట్టింది. ఏకంగా 56 మంది ఐఏఎస్ అధికారులకు స్థాన చలనం కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీరిలో 21 మంది కలెక్టర్లు ఉండడం గమనార్హం. అలాగే, పలువురు జూనియర్లకు కూడా పోస్టింగులు ఇచ్చింది. అంతేకాదు, త్వరలో మరికొందరు అధికారులను కూడా ట్రాన్స్‌ఫర్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

18 మంది సీనియర్‌ ఐఏఎస్‌లకు స్థానచలనం :

విద్యాశాఖ ప్రధాన కార్యదర్శిగా ఉన్న చిత్రారామచంద్రన్‌కు అదనంగా గృహ నిర్మాణ శాఖ బాధ్యతలు అప్పగించింది. పశు సంవర్ధక శాఖ ప్రత్యేక కార్యదర్శిగా అదర్‌ సిన్హ, నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా రజత్‌కుమార్‌, సాధారణ పరిపాలన ముఖ్య కార్యదర్శిగా వికాస్‌రాజ్‌, విపత్తునిర్వహణ ముఖ్య కార్యదర్శిగా జగదీశ్వర్‌, ఈపీటీఆర్‌ఐ డైరెక్టర్‌ జనరల్‌గా పార్థసారథి, బీసీ సంక్షేమశాఖ కార్యదర్శి, కమిషనర్‌గా బుర్రా వెంకటేశం, వ్యవసాయ కార్యదర్శి, కమిషనర్‌గా జనార్ధన్‌ రెడ్డి, పంచాయతీరాజ్‌ శాఖ కార్యదర్శిగా సందీప్‌కుమార్‌ సుల్తానియా, ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శిగా రాహుల్‌ బొజ్జా, గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శిగా క్రిస్టినా, ఆర్థిక శాఖ కార్యదర్శిగా శ్రీదేవి, పిరశ్రమల కమిషనర్‌గా మాణిక్‌రాజ్‌, ఆర్థిక శాఖ కార్యదర్శిగా రొనాల్డ్‌రాస్‌, భూపరిపాలన శాఖ సంచాలకులుగా రజత్‌కుమార్‌ సైనీ, పురపాలక శాఖ కమిషనర్‌గా ఎన్‌. సత్యనారాయణ, మహిళా శిశు సంక్షేమశాఖ కార్యదర్శిగా దివ్య, సీఎస్‌కు ఎగ్జిక్యూటివ్‌ అసిస్టెంట్‌గా అద్వైత్‌కుమార్‌ సింగ్‌ నియమించబడ్డారు.

21 జిల్లాల కలెక్టర్లు బదిలీ :

అబ్దుల్ అజీజ్‌ను జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌గా నియమించగా, కామారెడ్డి జిల్లాకు శరత్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ఎంవీరెడ్డి, ఆదిలాబాద్‌కు ఎ.శ్రీదేవసేన, నారాయణపేటకు హరిచందన దాసరి, హైదరాబాద్‌కు శ్వేత మహంతి, నల్గొండకు పాటిల్ ప్రశాంత్ జీవన్, వరంగల్ అర్బన్‌కు రాజీవ్‌గాంధీ హన్మంతు, మహబూబ్‌ నగర్‌కు ఎస్.వెంకటరావు, సూర్యాపేటకు టి.వినయ్ కృష్ణ, మేడ్చల్‌కు వి.వెంకటేశ్వర్లు, ఆసిఫాబాద్‌కు సందీప్ కుమార్ ఝా, పెద్దపల్లికి ఎస్.పట్నాయక్, నిర్మల్‌కు ముషారఫ్ అలీ, ములుగుకు ఎస్‌కే ఆదిత్య, మహబూబాబాద్‌కు వీపీ గౌతమ్, జగిత్యాలకు జి.రవి, జనగామకు కె.నిఖిల, వనపర్తికి ఎస్‌కేవై బాషా, వికారాబాద్‌కు పసుమి బసూ, జోగులాంబ గద్వాలకు శ్రుతి ఓఝాలు బదిలీ అయ్యారు. మరికొందరు సీనియర్లకు శాఖల మార్పులతోపాటు, అదనపు బాధ్యతలు కూడా అప్పగించింది.

- Advertisement -