- Advertisement -
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం శ్రీమంతుడు. గ్రామాల అభివృద్ధి, ఊరిని దత్తత తీసుకోవాలనే నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మహేష్ కెరీర్‌లోనే బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.
2015 లో విడుదలైన శ్రీమంతుడు ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ2.0 బిలియన్లు వసూళ్ళు చేసింది ఈ సినిమా చూసిన తర్వాత సినీ, రాజకీయ ప్రముఖులు తమ ఊరిని దత్తత తీసుకోవడం ప్రారంభించారు.
శ్రీమంతుడు స్పూర్తితో ఇప్పటికి పలువురు తమ గ్రామాలను దత్తత తీసుకోవడం, అభివృద్ధి పనులు చేస్తూ రియల్ లైఫ్‌లో నిజంగానే శ్రీమంతులుగా నిలుస్తున్నారు. ఈ సినిమా విడుదలై నేటికి సరిగ్గా ఐదేళ్లు. ఈ సందర్భంగా మహేశ్, దర్శకుడు కొరటాల శివకు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ శుభాకాంక్షలు చెబుతూ విషెస్ తెలియజేస్తున్నారు.
- Advertisement -