తెలంగాణతో పాటు మిజోరం, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రిలీజైంది. ఒక్క ఛత్తీస్ గడ్ లో రెండు దశల్లో , మిగితా నాలుగు రాష్ట్రాల్లో ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయని సీఈసీ రాజీవ్ కుమార్ అన్నారు.
5 రాష్ట్రాల్లో 679 అసెంబ్లీ స్ధానాలకు ఎన్నికలు జరగనుండగా 16.5 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని చెప్పారు. ఆ ఐదు రాష్ట్రాల్లో మహిళా, యూత్ ఓటర్లు కీలకం కానున్నారని చెప్పారు.
తెలంగాణ ఎన్నికల షెడ్యూల్..
()నవంబర్ 3న నోటిఫికేషన్
()నవంబర్ 10 వరకు నామినేషన్లకు చివరి తేదీ
()నవంబర్ 13న నామినేషన్ల పరిశీలన
()నవంబర్ 15న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ
()నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
()డిసెంబర్ 3న ఫలితాలు
రాష్ట్రాల వారిగా పోలింగ్ తేదీ వివరాలు..
()రాజస్థాన్ లో నవంబర్ 23న
()మధ్యప్రదేశ్, మిజోరాంలో నవంబర్ 7న
()చత్తీస్ గఢ్ లో రెండు విడతల్లో నవంబర్ 7, 17 తేదీల్లో పోలింగ్
()తెలంగాణలో నవంబర్ 30న
()ఐదు రాష్ట్రాల్లో డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి.
Also Read:నవంబర్ 30న పోలింగ్..డిసెంబర్ 3న కౌంటింగ్