తమిళనాడుకు అమ్మగా కీర్తి ప్రతిష్టతలు సంపాదించుకున్న..జయలలిత మృతి అక్కడి ప్రజలకు విషాద ఛాయలు మిగిల్చింది. రాష్ట్ర్రవ్యాప్తంగా ఆమె అభిమానులు…కార్యకర్తలను శోక సంద్రలో మునిగిపోయేలా చేసింది. జయలలితను అమితంగా ఆరాధించే ఆమె అభిమానులు..అమ్మ ఇక లేదని తెలిసి షాక్‌కు గురై 470 మంది హఠాన్మరణం చెందారు. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణంతో తమిళనాడులో 470 గుండె ఆగి చనిపోయినట్టు ఆ పార్టీ ప్రకటించింది. 203 మంది పేర్ల జాబితాను పార్టీ శనివారం విడుదల చేసింది. ఒక్కో కుటుంబానికి 3 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్టు పేర్కొంది. జయ అభిమానులకు అన్నివిధాలా అండగా ఉంటామని భరోసాయిచ్చింది.
ప్రజా సంక్షేమ పథకాలతో..పేద ప్రజలకు అండగా నిలిచింది జయలలిత. పేదవాడిని ఆదుకునేందుకు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టింది. అమ్మ మంచి తనమే జయలలితను తమిళనాడుకు అమ్మను చేసి పెట్టింది. జయలలిత పాలన దక్షతను చూసే తమిళప్రజలు జయలలితకు వరుసగా రెండో సారి అధికారం అప్పగించారు. ఒకసారి అధికారం ఇస్తే..నెక్ట్స్ వేరొకరి ప్రభుత్వాన్ని గద్దనెక్కించే 30 ఏళ్ల తమిళనాడు రికార్డును బద్ధలు కొట్టిన ఘనత జయలలిత కే దక్కుతుంది. వరుసగా రెండుసార్లు అధికారాన్ని చేపట్టింది. ఆ ఒక్కటి చాలు జయలలిత తమిళ ప్రజల మనసులను ఎంతలా చురగొన్నదో తెలుసుకోవడానికి.
అందుకే అమ్మ మృతి చెందిందన్నవార్త ఆమె అభిమానులు జీర్ణం చేసుకోలేకపోయారు. జయలలిత మరణ వార్త విని దాదాపు 470 మంది చనిపోయినట్టు తెలుస్తోంది. కాగా అమ్మకు అంతిమ వీడ్కోలు పలికేందుకు మెరీనా బీచ్‌కు జనసంద్రోహంగా కదిలి వచ్చిన ఆమె అభిమానులు.. మెరీనా బీచ్ లో జయలలిత సమాధిని సందర్శించేందుకు ప్రజలు తండోపతండాలు తరలివస్తున్నారు. అమ్మకు సజల నేత్రాలతో నివాళులు అర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో జయలలిత సమాధి వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.