బాలకృష్ణ @ 46

490
nbk
- Advertisement -

తండ్రే గురువుగా నటనలో ఓనమాలు దిద్దుకుని ఇంతింతై అన్నట్టుగా ఎదిగి, తెలుగు సినిమా పరిశ్రమలో హీరోయిజానికి వన్నె తెచ్చిన అగ్రహీరో. విశేష ప్రేక్షకాదరణని, అపరిమిత అభిమానగణాన్ని సొంతం చేసుకున్న నటసింహం నందమూరి బాలకృష్ణ. సరిగ్గా 46 సంవత్సరాల క్రితం ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన బాలయ్య..ఈ 4 పదుల ప్రస్ధానంలో వెండితెర అగ్రహీరోగా ఎదిగారు. ప్రస్తుతం బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు బాలయ్య.

తండ్రి నందమూరి తారకరామారావు దర్శకత్వంలో రూపొందిన ‘తాతమ్మ కల’ చిత్రంతో బాలకృష్ణ బాలనటుడిగా వెండితెరంగేట్రం చేశారు. ఆ తర్వాత పలు చిత్రాల్లో బాలనటుడిగా నటించి ప్రేక్షకుల మెప్పు పొందారు. వీటిల్లో ‘దానవీర శూరకర్ణ’లో బాలకృష్ణ నటించిన అభిమాన్యుడి పాత్ర ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. మంగమ్మగారి మనవడు సినిమాతో ఫస్ట్ హిట్ కొట్టి, ముద్దుల కృష్ణయ్య,అనసూయమ్మగారి అల్లుడు లాంటి సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్ లో ఫుల్ ఫాలోయింగ్ తెచ్చుకున్నారు బాలయ్య. నారీ నారీ నడుమ మురారి తర్వాత ఫ్యామిలీ సబ్జెక్ట్స్ నుంచి టర్న్ అయ్యి లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్ పెక్టర్ లాంటి విజయాలతో మాస్ లో తిరుగులేని ఇమేజ్ తెచ్చుకున్నారు.

జానపద, పౌరాణిక, చారిత్రక చిత్రాల్లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త స్థానం నిలుపుకున్న నటరత్న, నందమూరి బాలకృష్ణ శ్రీరామరాజ్యం లాంటి భక్తిరసాత్మక చిత్రాలు చేసి విజయాలు అందుకున్నారు. 2000ల స్టార్టింగ్ లో బాలయ్య కెరీర్ కొంచెం స్లో అయినా సింహా హిట్ తో మళ్లీ ఫామ్ లోకి వచ్చారు. లెజెండ్ తో 500లరోజులు కంప్లీట్ చేసుకుని తన తరం హీరోల్లో తనకు తిరుగులేని ఇమేజ్ ఉందని మళ్లీ నిరూపించుకున్న బాలయ్య సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ సూపర్ సక్సెస్ అయ్యారు.

2014ఎన్నికల్లో హిందూపుర్ ఎమ్మెల్యేగా గెలిచి సినిమాలు,రాజకీయాలు రెండింటిని బ్యాలెన్సింగ్ గా రన్ చేస్తున్నారు.2019లో మరోసారి హిందూపుర్ నుంచి గెలిచిన బాలయ్య రాజకీయాల్లోనూ తన మార్క్ చూపించారు.క్రిష్ దర్శకత్వంలో గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాతో 100వ సినిమా మైలు రాయిని అందుకున్నారు బసవతారక పుత్ర బాలకృష్ణ. ఇక ఎన్టీఆర్ బయోపిక్ తో ఆ మహానటుడి చరిత్రను ప్రజలకు అందించారు.ఎన్టీఆర్ వారసుడిగా అభిమానులను అలరిస్తున్న బాలయ్య మరెన్నో హిట్ సినిమాలను తీ యాలని గ్రేట్ తెలంగాణ.కామ్ మనస్పూర్తిగా కోరుకుంటోంది.

- Advertisement -