ఫ్యూచర్‌ గ్రూప్‌ ఇకపై రిలయన్స్‌ చేతిలో!

194
reliance

వ్యాపార విస్తరణలో భాగంగా బిజినెస్ టైకూన్ ముఖేష్ అంబానీ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫ్యూచర్ గ్రూప్‌కు చెందిన రిటైల్, హోల్ సేల్ వ్యాపారాలతో పాటు లాజిస్టిక్స్‌, వేర్ హౌజింగ్ విభాగాలను రిలయన్స్‌ ఇండస్ట్రీస్ కొనుగోలు చేయనున్నట్లు తెలిపింది.

ఈ డీల్‌ విలువ రూ.24,713 కోట్లు కాగా ఫ్యూచర్‌ గ్రూప్‌లో భాగమైన 1,800లకుపైగా బిగ్‌బజార్, ఎఫ్‌బీబీ, ఈజీడే, సెంట్రల్, ఫుడ్‌హాల్‌ స్టోర్లని వినియోగించుకునేందుకు రిలయన్స్‌కు మార్గం సుగుమమైంది.

ఈ ఢీల్‌తో 1800 రిటైల్స్ స్టోర్స్ రిలయన్స్ స్వంతం కానుండగా దేశవ్యాప్తంగా 420 పట్టణాల్లో ఫ్యూచర్ గ్రూప్ బిగ్ బజార్, ఈజీ డే, ఎఫ్‌బీబీ, సెంట్రల్, ఫుడ్ హాల్స్ ఉన్నాయి.