బిగ్ బాస్‌లోకి సరిలేరు నీకెవ్వరు రమణ..!

191
ramana
- Advertisement -

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 సెప్టెంబర్ 5 నుండి ప్రారంభంకానుంది. ఇప్పటికే కంటెస్టెంట్‌లు క్వారంటైన్‌లో ఉండగా వీరిపేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. విశ్వసనీయవర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం యాంకర్ రవి, లోబో,వీజే సన్నీ,ప్రియా,ఆర్జే కాజల్,సిరి హనుమంత్,మానస్,లహరి,సరయూ సుమన్ ఈసారి హౌస్‌లోకి వెళ్లనుండగా తాజాగా మరో పేరు వినిపిస్తోంది.

రమణ లోడ్ ఎత్తాలిరా.. ఈ డైలాగ్ తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడేమో ఇప్పుడు. సరిలేరు నీకెవ్వరు సినిమాలో అనిల్ రావిపూడి రాసిన ఈ ఒక్క డైలాగ్ ఇండస్ట్రీలో 30 ఏళ్లుగా ఉన్న ఆ నటుడి జీవితాన్ని మార్చేసింది. ఈ ఒక్క డైలాగ్‌తో పాపులర్ అయిపోయారు 60 ఏళ్ల కుమనన్. ఇప్పుడు ఈయన కూడా బిగ్ బాస్ హౌస్‌లో సందడి చేయనున్నారట. ఈ వార్త ఇప్పుడు టీ టౌన్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

సైరా, వెంకీ, స్టాలిన్, అల్లుడు శీను, అరవింద్ 2 లాంటి చిత్రాలతో నటించారు కుమనన్. తాజాగా బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారనే వార్త చర్చనీయాంశంగా మారగా దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.

- Advertisement -