- Advertisement -
రాష్ట్రంలో నిరుద్యోగులకు శుభవార్తను అందించారు సీఎం కేసీఆర్. 80039 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. దీంతో మరో తీపికబురు అందించారు. పోలీస్ శాఖ వంటి యూనిఫాం సర్వీసులు మినహా ఇతర ప్రత్యక్ష నియామకాల్లో గరిష్ఠ వయోపరిమితిని పదేండ్లకు పెంచుతున్నట్లు తెలిపారు సీఎం.
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఓసీలకు 44 ఏండ్లకు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 49 ఏండ్లకు, దివ్యాంగులకు 54 ఏండ్లకు గరిష్ట వయోపరిమితి పెరుగుతుందన్నారు.ఇక స్వరాష్ట్రంలో తొలిసారిగా గ్రూప్-1 నోటిఫికేషన్ వెలువడనుంది.
గ్రూప్ -1 కింద 503 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభా వేదికగా వెల్లడించారు. దీంతో గ్రూప్ 1 కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
- Advertisement -