చిరుతో బాబి..మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌!

145
chiru
- Advertisement -

టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న‌ మెగాస్టార్ చిరంజీవి హీరోగా టాలెంటెడ్‌ దర్శకుడు బాబీ (కెఎస్ రవీంద్ర) ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న‌ మెగా 154 చిత్రం షూటింగ్ జ‌రుగుతోంది. ఈ చిత్రం అన్ని కమర్షియల్ హంగుల తో కూడిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ గా రూపొందుతోంది.

మెగా154 కోసం ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ లో మహిళా దినోత్సవం సంద‌ర్భం గా హీరోయిన్‌ గా శృతి హాసన్‌ ను ఎంపిక‌చేసిన‌ట్లు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీతో శ్రుతిహాసన్‌ కి ఇది తొలి కాంబినేష‌న్ కావ‌డం విశేషం..నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, జి కె మోహన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం అగ్రశ్రేణి సాంకేతిక బృందం సహకరిస్తోంది, అయితే పలువురు ప్రముఖ నటీనటులు ఇందులో భాగమయ్యారు.

మెగా154 కి చిరంజీవి కి అనేక చార్ట్‌ బస్టర్ ఆల్బమ్‌ లను అందించిన రాక్‌ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, ఆర్థర్ ఎ విల్సన్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. ఎడిటర్‌ గా నిరంజన్‌ దేవరమానె, ప్రొడక్షన్‌ డిజైనర్‌ గా ఎఎస్‌ ప్రకాష్‌ పని చేస్తున్నారు. సుస్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్.బాబీ స్వయంగా కథ, మాటలు రాయగా, కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే రాశారు. రైటింగ్ డిపార్ట్‌మెంట్‌ లో హరి మోహన కృష్ణ మరియు వినీత్ పొట్లూరి కూడా ఉన్నారు.

- Advertisement -