దేశంలో ముమ్మరంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ..

170
corona
- Advertisement -

దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 43,393 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 911 మంది మృతిచెందారు. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,07,52,950కి చేరగా 2,98,88,284 మంది కరోనా నుండి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 4,58,727 యాక్టివ్ కేసులుండగా కరోనాతో 4,05,939 మంది మృతిచెందారు.

గత 24 గంటల్లో 40,23,173 టీకాలు పంపిణీ చేయగా వ్యాక్సిన్‌ తీసుకున్నవారి సంఖ్య 36,89,91,222 చేరింది. దేశవ్యాప్తంగా జూలై 8 వరకు 42,70,16,605 నమూనాలకు కరోనా పరీక్షలు నిర్వహించామని ఐసీఎంఆర్ వెల్లడించింది.

- Advertisement -