అభిరామ్‌ కోసం రంగంలోకి ఆర్పీ..!

28
rp

తెలుగు ఇండస్ట్రీలో వారసులకు కొదవలేదు. ఇప్పటికే చాలామంది హీరోల వారసులు వెండితెరకు పరిచయం కాగా తాజాగా దుగ్గుబాటి ఫ్యామిలీ నుండి మరో హీరో ఆరంగేట్రానికి రంగం సిద్ధమవుతోంది. హీరో రానా తమ్ముడు అభిరామ్‌ త్వరలోనే సిల్వర్ స్క్రీన్‌పై సందడి చేయనున్నాడు

ప్రముఖ దర్శకుడు తేజ దర్శకత్వంలో దగ్గుబాటి అభిరామ్ హీరోగా పరిచయం అవుతుండగా ఈ చిత్రానికి సంబంధించిన మ్యూజిక్ సిటింగ్స్ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ నేతృత్వంలో జరుగుతున్నాయి. ఈ చిత్రానికి ప్రముఖ గీత రచయిత చంద్రబోస్ పాటలు రాస్తున్నారు. ఇక వచ్చే నెల నుంచి ఈ చిత్రం షూటింగ్ మధ్యప్రదేశ్ లోని పలు లొకేషన్లలో జరుగుతుంది.