కార్తీక దీపం…మోనిత గుట్టురట్టు..!

127
monitha

బుల్లితెర పాపులర్ షో కార్తీక దీపం 1087 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. ఇక ఇప్పటివరకు అబద్దపు కడుపుతో కార్తీక్‌తో ఆటాడుకున్న మోనితకు భాగ్య షాక్ ఇస్తుంది. అసలు నీ కడుపు కారణం కార్తీక్ అనడానికి సాక్ష్యం ఏంటీ…?నువ్వు డాక్టర్‌వి ..?ఏదైనా చేయగలవు..కార్తీక్ అమాయకుడు అంటూ కోపంగా చెప్పడంతో మోనిత షాక్ తింటుంది. తర్వాత దీప -ఆదిత్య కూడా ఓ ప్లాన్ వేయడంతో మోనిత గుట్టు తరువాయి భాగంలో రట్టుకానుంది.

ముందుగా దీపతో ప్రేమగా మాట్లాడుతాడు కార్తీక్. తాను ఏ తప్పు చెయ్యలేదని… నిజంగా తప్పు చేసి ఉంటే నాకు తప్పించుకోవడం తెలియదని…తప్పు చేశానంటే తన మనసాక్షి ఒప్పుకోవడం లేదని…అందుకే ఎవరిముందు తల దించుకుని నిలబడాల్సిన కర్మ కానీ వాళ్లు చెప్పినట్లు చెయ్యాల్సిన అవసరం కానీ నాకు లేవని తేల్చి చెబుతాడు కార్తీక్. ఈ నెల 25వ తేదీలోపే ఈ సమస్యకు పరిష్కారం కచ్చితంగా దొరుకుతుంది… ఇదంతా నటన కాదు అని దీపతో చెప్పి అక్కడినుండి వెళ్లిపోతాడు కార్తీక్.

ఇక కార్తీక్ చేసిన పనికి కోపంతో రగిలిపోతుంటాడు ఆదిత్య. శ్రావ్యతో అన్నయ్య చేసిన పనికి మన పరువు పోయింది. మహా తల్లి(సౌందర్య) ఏం జరగనట్లు అమెరికా వెళ్లిపోయింది. వెళ్తు వెళ్తూ ఆవేశం తగ్గించుకో.. అన్నయ్య మీద అరవకు అని చెప్పిందని ఆదిత్య చెప్పగా మరో షాక్ ఇస్తుంది శ్రావ్య. ఈ నెల 25న మోనిత పెళ్లికి రిజిస్టర్ ఆఫీస్‌లో స్లాట్ బుక్ చేసుకుందని చెప్పగా ఆదిత్య షాక్‌కు గురవుతాడు. వదిన ఏం నిర్ణయం తీసుకుంటుందో అని శ్రావ్యతో చెబుతాడు కార్తీక్.

ఇక దీప కార్తీక్, హిమ, సౌర్యలతో కలిసి దిగిన సెల్ఫీని చూసుకుని తెగ మురిసిపోతుంది. అయితే ఆ ఫోటోలో వెనుకే మోనిత గీసిన గీతలు ఉండటంతో ఆవేశంతో రగిలిపోతుంది. వెంటనే ఓ గిన్నె నిండా నీళ్లు.. కర్చిఫ్ తీసుకుని ఆ గోడ మీద గీతలని తుడిచేస్తుంది.

సీన్ కట్ చేస్తే…మోనిత ఆవేశంగా భాగ్యం ఇంటికి వెళ్తుంది. ఏంటి నేనే లేనప్పుడు నా హాస్పెటల్‌కి వచ్చి కథలు పుట్టిస్తున్నావట? నాతో పెట్టుకోకు అని తెలపగా భాగ్య కూడా అంతే ఘాటుగా రిప్లై ఇస్తుంది. చింతపండు ముఖందానా.. కాకి మెడదానా.. అంటూ నోటికి వచ్చిన తిట్లన్నీ తిడుతుంది. నువ్వొక డాక్టర్‌వి. దొంగ సాక్ష్యం పుట్టించవని గ్యారెంటీ ఏంటీ? నా అల్లుడు మంచి తనాన్ని అడ్డం పెట్టుకుని నువ్వే..దొంగ కడుపు పుట్టించావేమో ఎవరికి తెలుసే? అంటూ చెప్పగా మోనిత షాక్ తింటుంది.

ఇక తర్వాత ఆదిత్య….దీప ఇంటికి వెళ్తాడు. వదినా 25న పెళ్లి అంట కదా.. ఏం చేద్దాం ఎలా ఆపుదాం.. అసలు అన్నయ్య గురించి నువ్వు ఏం అనుకుంటున్నావ్ అంటూ కంగారు పడుతూ అడుగుతాడు. మీ అన్నయ్య మీద నమ్మకం ఉంది… నువ్వు పెళ్లి ఆపడానికి ఏం చేద్దాం అని అడిగావ్.. అంటే నా భవిష్యత్ గురించే కదా అడిగావ్.. అలాగే మీ అన్నయ్య ఒంటరి అయిపోయారు. ఎవరూ నమ్మడం లేదని బాధపడుతున్నారు. చూద్దాం. మనం ఏం చెయ్యగలమో చూద్దాం.. అంటుంది దీప. తర్వాత వారిద్దరు కలిసి మోనితకు అసలు గర్బం ఎలా వచ్చిందనే దానిపై చేసే పనేంటి…?అది ఎంత వరకు సత్ఫలితం ఇస్తుంది అనేది ఇవాళ్టి ఎపిసోడ్‌లో చూడాల్సిందే.