97.37 శాతానికి చేరిన రికవరీ రేటు

58
corona

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగాయి. గత 24గంటల్లో 42,625 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 562 మంది మృతిచెందారు. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,17,69,132 కు చేరింది. కరోనాతో ఇప్పటివరకు 4,25,757 మంది మృతిచెందగా 4,10,353 యాక్టివ్ కేసులున్నాయి.

కరోనా నుండి ఇప్పటివరకు 3,09,33,022 మంది కోలుకున్నారు. దేశంలో రికవరీ రేటు 97.37శాతంగా ఉండగా మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసులు 1.29శాతం న్నాయి. ఇప్పటి వరకు 47.31 కోట్ల కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా టీకా డ్రైవ్‌లో భాగంగా మొత్తం 48,52,86,570 టీకాలు పంపిణీ చేసినట్లు వైద్య,ఆరోగ్య శాఖ వెల్లడించింది.