- Advertisement -
కరోనా బాధితుల చికిత్స కోసం కింగ్ కోఠి ఆసుపత్రి సిద్దంగా ఉందన్నారు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్. అధునాతన సౌకర్యాలతో ప్రత్యేకంగా 350 పడకలతో ఆస్పత్రిని సిద్ధం చేశామని చెప్పారు. హైదరాబాద్‌లో మరో నాలుగు ప్రత్యేక ఆస్పత్రులను కూడా పూర్తిగా కరోనా రోగుల చికిత్స కోసమే సిద్ధం చేస్తున్నామని కేటీఆర్ వెల్లడించారు.
కరోనా వైరస్ బారిన పడ్డ వారికి హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగితే బాధితులకు చికిత్స అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. వైరస్ అనుమానితులను ఐసోలేట్ చేయడానికి, రోగులకు అవసరమైన చికిత్స అందించడానికి రాష్ట్రంలో 8 ఆస్పత్రులను పూర్తిగా వినియోగించుకోవాలని వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయించింది.
- Advertisement -