ఆదివారం కురిసిన వర్షానికి రాష్ట్రం తడిసి ముద్దైంది. రాత్రి మొదలైన వర్షం ఉదయం వరకు పడటంతో భాగ్యనగరంలో రోడ్లన్ని జలమయం అయ్యాయి. నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి.
మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. పలు జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయని వెల్లడించింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
Also Read:పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుపై సీఎం రివ్యూ..
సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములు గు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వడగళ్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
Also Read:May Day:కార్మిక దినోత్సవం