ఉగ్రవాదిగా మారిన 3నెలల చిన్నారి…!

226
3years old boy get noties from american officers
- Advertisement -

అవును..మీరు చదివింది నిజమే. మూడు నెలల చిన్నారి ఉగ్రవాదిగా మారింది. కాదు, కాదు మార్చేశారు. ఇంతకీ ఆ మూడు నెలల చిన్నారి ఎలా ఉగ్రవాదిగా మారింది.. ఆకలేస్తే…కడుపు నింపకపోతేనా..? లేక పాలకు దూరం చేస్తేనా..? ఒకవేళ అలాచేస్తే..ఆకలితో ఏడుస్తారే తప్ప ఆ చిన్నారులు చేసేదేముంటుంది. కేవలం ఏడవడం మాత్రమే తెలిసిన చిన్నారులు దాడులు, హత్యలు చేయగలరా..? కానీ ఓ మూడు నెలల చిన్నారి ఉగ్రవాది అంటూ  ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో ఆ చిన్నారిని విచారించారట లండన్‌లోని అమెరికా దౌత్యాధికారులు.

అయితే స్థానిక మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం ..చిన్నారి తాత పొరపాటుగా అతడిని ఉగ్రవాది అని పేర్కొనడమే ఇందుకు కారణంగా మారిట్లు తేలింది. చెషైర్‌కు చెందిన మూడు నెలల చిన్నారి హార్వీ కెన్యాన్‌తో కలిసి అతడి తల్లిదండ్రులు హాలిడే ట్రిప్‌ కోసం అమెరికాలోని ఫ్లోరిడా వెళ్లేందుకు ప్లాన్‌ చేసుకున్నారు. అయితే యూకే నుంచి అమెరికా వెళ్లాలంటే ఓ ఇమ్మిగ్రేషన్‌ ఫామ్‌ను నింపాల్సి ఉంటుంది. ఇందుకోసం ఆ చిన్నారి తాతయ్య పాల్‌ కెన్యాన్‌ హార్వీ ఇమ్మిగ్రేషన్‌ ఫామ్‌ను పూర్తిచేసి విమానయాన సంస్థకు అందించాడు. అదే ఇప్పుడా చిన్నారిని ఉగ్రవాదిగా మార్చేసింది. ఇక ఆ దరఖాస్తులో ‘మీరు ఉగ్రకార్యకలాపాల్లో పాలు పంచుకున్నారా?’ అనే ప్రశ్నకు హార్వీ ఫారంలో అతడి తాతయ్య పొరపాటుగా అవును అని టిక్‌ చేశారు.
  3years old boy get noties  from american officers
దాంతో.. కనీస విచక్షణ కూడా లేకుండా లండన్‌లోని అమెరికా దౌత్యకార్యాలయం హార్వీకి సమన్లు జారీ చేసింది. దీంతో ఫ్లోరిడా వెళ్లాల్సిన ఆ కుటుంబం హార్వీని తీసుకుని లండన్‌ వెళ్లారు. అక్కడ అధికారులు హర్వీని విచారించారు. ఈ సందర్భంగా హార్వీ తాతయ్య మీడియాతో మాట్లాడుతూ.. ఇలా జరుగుతుందని వూహించలేదని, మూడు నెలల చిన్నారి ఎవరికైనా హానీ చేస్తాడని అధికారులు ఎలా అనుకున్నారని వాపోయాడు.

ఇమ్మిగ్రేషన్‌ ఫాంలో పొరబాటు జరిగి ఉండొచ్చని కూడా వారు ఆలోచించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే విచారణ సమయంలో ఆ చిన్నారి కనీసం ఏడ్వలేదట. ఈ ఘటనతో హార్వీ కుటుంబం ఫ్లోరిడా విమానం మిస్సయింది. దీంతో వారు మరో విమానంలో వెళ్లారు. అయితే ఈ ఘటనపై అమెరికా దౌత్యకార్యాలయం ఇప్పటివరకు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఏదేమైనా..అమెరికా దౌత్యాధికారులు చేసిన తతంగానికి అక్కడి వారు ముక్కున వేలేసుకున్నారనే చెప్పాలి.

- Advertisement -