రాష్ట్రంలో కొత్తగా 3,660 కరోనా కేసులు..

57
covid-19

తెలంగాణలో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గడచిన 24 గంటల్లో 69,252 కరోనా పరీక్షలు నిర్వహించగా… 3,660 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 4,826 మంది కరోనా నుంచి కోలుకోగా, 23 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 5,44,263 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 4,95,446 మంది కోలుకున్నారు. ఇంకా 45,757 మందికి ఐసోలేషన్ లోనూ, ఆసుపత్రుల్లోనూ చికిత్స కొనసాగుతోంది. మొత్తం మరణాల సంఖ్య 3,060కి చేరింది. తెలంగాణలో కోలుకుంటున్న వారి శాతం 91.03కి పెరిగింది.

జిల్లాల వారీగా క‌రోనా పాజిటివ్ కేసుల వివ‌రాలిలా ఉన్నాయి. ఆదిలాబాద్‌-16, భ‌ద్రాద్రి కొత్త‌గూడెం-121, జీహెచ్ఎంసీ-574, జ‌గిత్యాల‌-93, జ‌న‌గాం-38, జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి-45, జోగులాంబ గ‌ద్వాల‌-55, కామారెడ్డి-31, క‌రీంన‌గ‌ర్‌-147, ఖ‌మ్మం-217, కొమురంభీం ఆసిఫాబాద్‌-23, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌-128, మ‌హ‌బూబాబాద్‌-72, మంచిర్యాల‌-108, మెద‌క్‌-47, మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి-218, ములుగు-51, నాగ‌ర్‌క‌ర్నూలు-118, న‌ల్ల‌గొండ‌-166, నారాయ‌ణ‌పేట‌-33, నిర్మ‌ల్‌-18, నిజామాబాద్‌-59, పెద్ద‌ప‌ల్లి-120, రాజ‌న్న సిరిసిల్ల‌-66, రంగారెడ్డి-247, సంగారెడ్డి-106, సిద్దిపేట‌-116, సూర్యాపేట‌-110, వికారాబాద్‌-112, వ‌న‌ప‌ర్తి-80, వ‌రంగ‌ల్ రూర‌ల్‌-103, వ‌రంగ‌ల్ అర్బ‌న్‌-131, యాదాద్రి భువ‌న‌గిరి-91. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 574 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది.