అఫీషియ‌ల్: ప్ర‌శాంత్ నీల్‌తో ఎన్టీఆర్ మూవీ

46
ntr

సెన్సేష‌న‌ల్ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్‌తో ఎన్టీఆర్ చిత్రం ఒక‌టి ఉంద‌ని గ‌తం నుండి వార్త‌లు వ‌స్తుండ‌గా, ఈ రోజు ఆ సినిమాపై అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న చేశారు ప్ర‌శాంత్ నీల్. నేడు తారక్( మే 20 గురువారం ) పుట్టిన రోజు సందర్భంగా నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ వీరిద్దరి ఫొటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసి వెల్లడించాయి..ర‌క్తంతో త‌డిసిన నేల ఒక్క‌టి మాత్ర‌మే గుర్తుంచుకుంటుంది, ఒకే ఒక్క ఫోర్స్ ఎన్టీఆర్‌తో సినిమా చేసేందుకు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నా అంటూ ప్ర‌శాంత్ నీల్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

ప్రస్తుతం ప్రభాస్‌తో ‘సలార్’ తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ నీల్. ఇటు తారక్ ‘ఆర్ఆర్ఆర్’ పూర్తి చేసి ఆ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో 30వ సినిమా చేనున్నాడు. వీటి తర్వాత ప్రశాంత్ నీల్‌ తారక్ కాంబినేషన్‌లో భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ప్రారంభం కానుంది.