ఏపీలో కొనసాగుతున్న కరోనా బీభత్సం..

35
corona

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా బీభత్సం కొనసాగుతూనే ఉంది. గడచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 1,01,281 కరోనా పరీక్షలు నిర్వహించగా 22,610 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తూర్పు గోదావరి జిల్లాలో 3,602 కేసులు, చిత్తూరు జిల్లాలో 3,185 కేసులు నమోదయ్యాయి. 114 మంది మృత్యువాత పడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 17 మంది, చిత్తూరు జిల్లాలో 15 మంది మరణించారు.

ఈ నేపథ్యంలో, రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 9,800కి చేరింది. అదే సమయంలో 23,098 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఏపీలో ఇప్పటివరకు 15,21,142 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 13,02,208 మంది పూర్తిగా కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 2,09,134 మంది చికిత్స పొందుతున్నారు.