టీటీడీ బోర్డులో మరో ఏడుగురిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. ఇప్పటికే 29 మందితో టీటీడీ బోర్డును ఏర్పాటుచేయగా మరో ఏడుగురిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించింది. దీంతో టీటీడీ బోర్డు 36 మందికి పెరిగింది.
టీటీడీ బోర్డు మాజీ చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, బీజేపీ ఎంపీ రాకేశ్ సిన్హా (ఢిల్లీ), శేఖర్‌రెడ్డి (చెన్నై), జనతాదళ్-ఎస్ ఎమ్మెల్యే కృపేందర్ రెడ్డి (బెంగళూరు), గోవిందహరి (హైదరాబాద్), దుష్మంత్ కుమార్‌దాస్ (భువనేశ్వర్), అమోల్ కాలే (ముంబై)లను నియమించింది. టీటీడీ బోర్డు ఉన్నంతకాలం వీరు ప్రత్యేక ఆహ్వానితులుగా కొనసాగనున్నారు.
టీటీడీ పాలకమండలి సభ్యులు సోమవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. అనంతరం అన్నమయ్య భవనంలో బోర్డు తొలి సమావేశం జరగనుంది. ఏపీతో పాటు తెలంగాణ,కర్ణాటక,తమిళనాడు,ఢిల్లీ,మహారాష్ట్రలకు చెందిన వారికి బోర్డులో స్ధానం కల్పించింది ఏపీ సర్కార్.