సైరా..ప్రతీ ఫ్రేమ్‌ సూపర్బ్: మహేష్

541
mahesh babu syeraa
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సైరా. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్‌ 2న ప్రేక్షకుల ముందుకురానుంది.

సినిమా ప్రమోషన్‌లో భాగంగా విడుదల చేసిన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. బాలీవుడు,టాలీవుడ్ హీరోలు ట్రైలర్‌ బాగుందని కితాబిస్తున్నారు. విజువల్ వండర్ గా తీసిన ట్రైలర్‌లో మెగాస్టార్ తన నటవిశ్వరూపాన్ని చూపించాడు. మరోవైపు సూపర్ స్టార్ అమితాబ్ సినిమాలో కీలక పాత్ర చేస్తుండటం బాలీవుడ్ లో రిలీజ్ కు అనుకూలంగా మారింది.

తాజాగా సైరా ట్రైలర్‌పై స్పందించాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ట్రైలర్ విజువల్ వండర్ గా ఉందని, ట్రైలర్ లోని ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా ఉందని కితాబిచ్చారు. మెగాస్టార్ చిరంజీవి యాక్టింగ్ సూపర్బ్ …అమితాబ్, చరణ్, సురేందర్ రెడ్డి, డీవోపీ రత్నవేలుకు అలాగే యూనిట్ ను మెచ్చుకుంటూ ట్వీట్ చేశారు.

- Advertisement -