- Advertisement -
దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో కొత్తగా 35,342 మందికి కరోనా పాజిటివ్‌గా తేలగా 483 మంది మృతిచెందారు. ప్రస్తుతం దేశంలో 4,05,513 యాక్టివ్ కేసులుండగా మరణించిన వారి సంఖ్య 4,19,470కి చేరింది. ఇక దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటి వరకు 42,34,17,030 మందికి కోవిడ్ టీకాలు వేశారు.
మణిపూర్‌లో 80 ఏళ్లు దాటిన ఓ వృద్ధురాలికి కొద్దిరోజుల క్రితం కరోనా సోకగా ఆమెను వంటరిగా వదిలేశారు కుటుంబసభ్యులు. దీంతో డాక్టర్లు, వైద్యసిబ్బందే ఆమెకు సేవలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది.
- Advertisement -