‘సైరా’ నుండి సుదీప్‌ ఫస్ట్‌ లుక్‌..

250
Kichacha Sudeep First Look
- Advertisement -

మెగాస్టార్‌ చిరంజీవి టైటిల్‌ పాత్రలో నటిస్తున్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి`. సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్‌ పతాకంపై సురేందర్‌ రెడ్డి దర్శకుడిగా హై టెక్నికల్‌ వేల్యూస్‌తో తెరకెక్కుతోంది. ఈ మూవీలో అమితాబ్‌ బచ్చన్‌, నయనతార, తమన్నా, విజయ్‌ సేతుపతి, జగపతిబాబు, సుదీప్‌ ప్రధాన తారాగణంగా మెగాపవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ రూపొందిస్తున్నారు. 200 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ ‘సైరా నరసింహారెడ్డి` నిర్మిస్తున్నారు‌.

Kichacha Sudeep First Look

వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్‌లో విడుద‌ల కానున్న ఈ చిత్రం శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. ఈ సినిమాలో సుదీప్‌ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో క‌న్న‌డ సూప‌ర్‌స్టార్, అభిన‌య చ‌క్ర‌వ‌ర్తి సుదీప్ అవుకు రాజు అనే పాత్ర‌లో న‌టిస్తున్నారు. సెప్టెంబ‌ర్ 2న సుదీప్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా అవుకు రాజుగా సుదీప్ లుక్‌ను తాజాగా చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.

- Advertisement -