సిగరేట్లపై 35 శాతం జీఎస్టీ!

1
- Advertisement -

మరోసారి జీఎస్టీ స్లాబ్‌ను సవరించింది కేంద్రం. కొన్ని రకాల కూల్స్ డ్రింక్స్‌, సిగరెట్లు, పొగాకు సంబంధిత ఉత్పత్తులపై ప్రస్తుతం ఉన్న జీఎస్టీని 28 శాతం నుండి 35 శాతానికి పెంచాలని జీఎస్టీపై ఏర్పాటైన మంత్రుల గ్రూపు(జీఓఎం) నిర్ణయించింది.

ఈ నిర్ణయంతో రూ.1500 వరకు ధర ఉండే రెడీమేడ్ దుస్తులపై 5 శాతం పన్ను, రూ.1500 నుండి రూ.10 వేల మధ్య ఉన్న వాటిపై 28 శాతం జీఎస్టీని విధించనున్నారు. ప్రస్తుతం పొగాకు, సంబంధిత ఉత్పత్తులు, ఏరేటెడ్ పానీయాలపై 35 శాతం ప్రత్యేక రేటును ప్రతిపాదించడానికి జీఓఎం అంగీకరించింది. ఇప్పటివరకు 5, 12, 18, 28 శాతం నాలుగు అంచెల పన్ను శ్లాబులు కొనసాగుతున్నాయి. 35 శాతం కొత్త రేటును జిఓఎం ప్రతిపాదించింది,” అని ఓ అధికారి తెలిపారు.

బిహార్ ఉపముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి నేతృత్వంలోని జీఓఎం పలు రకాల వస్తువులపై పన్ను రేట్లను హేతుబద్ధీకరించాలని నిర్ణయించింది. జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణపై కౌన్సిల్​ ముందు ప్రవేశపెట్టబోయో నివేదికను జీఓఎం సోమవారం ఖరారు చేసింది. రూ.10,000 లోపు ఖరీదు చేసే సైకిళ్లపై జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలని జీఓఎం నిర్ణయించింది.అలాగే ఎక్సర్​సైజ్ నోట్​బుక్​లపై జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలని నిర్ణయించింది.జీఎస్టీ పెంపుతో సిగరెట్ల ధరలు మరింత పెరగనున్నాయి.

Also Read;Rewind 2024: మూడోసారి విజయం ఎన్డీయే కూటమిదే

- Advertisement -