దేశంలో 24 గంటల్లో 3.32 లక్షల కరోనా కేసులు..

161
ap corona
- Advertisement -

దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. వరుసగా రెండోరోజు 3లక్షలకుపైగా కరోనా కేసులు నమోదుకాగా గత 24 గంటల్లో కొత్తగా 3,32,730 కొవిడ్‌ కేసులు నమోదుకాగా 2,263 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,62,63,695కు చేరగా 1,93,279 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. కరోనాతో ఇప్పటివరకు 1,86,920 మంది ప్రాణాలు కొల్పోగా ప్రస్తుతం దేశంలో 24,28,616 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటి వరకు 27.44 కోట్ల శాంపిల్స్‌ పరీక్షించినట్లు ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) తెలిపింది.

- Advertisement -