రష్మికా గుండు ఫోటోలు వైరల్..!

106
rashmika

తన అందం,నటనతో టాలీవుడ్,కోలీవుడ్‌లలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి రష్మిక మందన్నా. తన క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో అగ్రహీరోలతో నటిస్తూ మెప్పిస్తున్న రష్మికా….ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

తమిళనాడులోని కొన్ని సెలూన్‌ బోర్డులపై ప్రస్తుతం గుండుతో ఉన్న రష్మిక ఫోటోలు దర్శనమిస్తున్నాయి. తమ వ్యాపారం కోసం కొంతమంది ఇలా రష్మిక ఫోటోను వాడేశారని తెలిసి ఆమె ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎక్కువగా షేర్ చేస్తున్న ఇతర కథానాయికల ఫ్యాన్స్ పేజీలకు వార్నింగ్ ఇస్తున్నారు రష్మిక ఫ్యాన్స్.ప్రస్తుతం రష్మిక గుండు వివాదం సోషల్ మీడియాలో రచ్చ.. రచ్చగా మారింది.