దేశంలో కొత్త‌గా 31,222 కరోనా కేసులు న‌మోదు..

171
Covid

దేశంలో కరోనా విజృంభన కొనసాగుతూనే ఉంది. గ‌డిచిన 24 గంట‌ల్లో దేశంలో కొత్తగా 31,222 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది. దీంతో దేశంలో క‌రోనా కేసుల సంఖ్య మొత్తం 3,30,58,843కి చేరింది. అలాగే, నిన్న 42,942 మంది కోలుకున్నార‌ని పేర్కొంది. దేశంలో క‌రోనాతో మ‌రో 290 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 4,41,042కి పెరిగింది.

ఇక క‌రోనా నుంచి ఇప్ప‌టివ‌ర‌కు 3,22,24,937 మంది కోలుకున్నారు. 3,92,864 మందికి ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్‌ల‌లో చికిత్స అందుతోంది. దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 69,90,62,776 డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు.