తన కెరీర్‌పై ముందే చెప్పిన ధోని: యువరాజ్‌

96
Yuvraj Singh on missing 2019 World Cup

తన కెరీర్‌పై చాలాకాలం ముందే మహేంద్రసింగ్ ధోని స్పష్టత ఇచ్చారని తెలిపారు భారత మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్ సింగ్. 2019 ప్రపంచకప్‌కు తనను సెలక్టర్లు పరిగణలోకి తీసుకోరని మహీ చెప్పారని తెలిపాడు యువీ.

తాను టీమిండియాలో పునరాగమనం చేసినప్పుడు కోహ్లీ మద్దతిచ్చారని కానీ జట్టులో చోటు కోల్పోయాక నా వెనుక నిలబడలేదన్నారు. ఆ తర్వాత ధోనీ నాకు 2019 ప్రపంచకప్​పై పూర్తి స్పష్టతనిచ్చాడు. ఆ టోర్నీ కోసం సెలెక్టర్లు నా పేరును పరిశీలించట్లేదని తెలిపాడని వెల్లడించాడు యువీ.

2003, 2007, 2011 వన్డే ప్రపంచకప్​ల్లో యువీ బరిలోకి దిగాడు. 2011 విశ్వటోర్నీలో ఆల్​రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టి భారత్​ విజేతగా నిలువడంలో కీలపాత్ర పోషించాడు. మ్యాన్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. 2011 ప్రపంచకప్ తర్వాత క్యాన్సర్ యువీ క్యాన్సర్​తో పోరాడి విజయం సాధించిన సంగతి తెలిసిందే.