ఘనంగా వరుణ్‌-నటాషా వివాహం

48
varun dhawan

బాలీవుడ్ ప్రేమజంట వరుణ్‌ ధావన్, నటాషా దలాల్ వివాహం ఆదివారం ఘనంగా జరిగింది. గత కొంతకాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న ఈ జంట పెళ్లి గతేడాది మేలో జరగాల్సిఉండగా కరోనా కారణంగా వాయిదా పడింది.

ముంబైలోని అలీబాగ్‌లో ఉన్న మాన్సన్ హౌస్ రిసార్ట్‌లో వీరి వివాహం అంగరంగ వైభవంగా ఈ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు వరుణ్ ధావన్‌. హిందూ సంప్రదాయం ప్రకారం జరిగిన ఈ వివాహ వేడుకలో వరుణ్, నటాషా కుటుంబ సభ్యులు, సన్నిహితులు పాల్గొన్నారు.

నటాషా దలాల్ ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్. వరుణ్, నటాషా స్కూల్ డేస్ నుంచే ఒకరికొకరు పరిచయం. ఆ తరవాత వీరు ప్రేమికులుగా మారారు.