క్రిప్టో కరెన్సీ లావాదేవీలపై 30% పన్ను..

90
nirmala
- Advertisement -

క్రిప్టో కరెన్సీ లావాదేవీల ద్వారా వచ్చే ఆదాయంపై 30 శాతం పన్ను విధించనున్నట్లు తెలిపారు నిర్మల సీతారామన్‌. బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సందర్భంగా మాట్లాడిన నిర్మల… క్రిప్టో వంటి డిజిటల్‌ ఆస్తుల పెట్టుబడులు పెరుగుతుండటంతో దీన్ని పన్ను పరిధిలోకి తీసుకొచ్చినట్లు తెలిపారు.

లాంగ్ టెర్మ్ క్యాపిటల్ గెయిన్స్‌పై 15 శాతం పన్ను విధిస్తామన్నారు. ఇందులో ఎలాంటి మినహాయింపులు ఉండవన్నారు. ఇక ఆదాయపన్ను రిటర్నుల్లో పొరపాట్లను సవరించుకునేందుకు దరఖాస్తు చేసిన ఏడాది నుంచి రెండేళ్లలో మార్పులు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు వెల్లడించారు.

స్టార్టప్ కంపెనీలకు పన్ను రాయితీని మరో ఏడాది పొడిగించినట్లు తెలిపారు. మాన్యుఫ్యాక్చరింగ్‌కు కన్సెషనల్ ట్యాక్స్ కొనసాగుతుందన్నారు. స్టేట్ ఎంప్లాయీస్‌కు ట్యాక్స్ డిడక్షన్‌ను 14 శాతానికి పెంచినట్లు చెప్పారు. రూ.1 కోటి నుంచి రూ.10 కోట్ల వరకు ఆదాయంగల సహకార సంఘాలకు సర్‌ఛార్జీని 7 శాతానికి తగ్గించినట్లు తెలిపారు.

- Advertisement -