ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. నాగాలాండ్, త్రిపురలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం కనిపిస్తుండగా మేఘాలాయలో మాత్రం ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినట్లుగానే హంగ్ దిశగా ఫలితాలు రాబోతున్నట్లు తెలుస్తోంది.
మేఘాలయలో అధికార నేషనల్ పీపుల్స్ పార్టీ , తృణమూల్ కాంగ్రెస్ మధ్య నువ్వానేనా అన్నట్లుగా ఆధిక్యం మారుతోంది. రాష్ట్రంలోని మొత్తం 60 స్థానాల్లో 59 సీట్లకు ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం అందులో ఎపీపీ 14 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నది. ఇక రాష్ట్రంలో ఎలాగైనా పాగావేయాలని పట్టుదలతో ఉన్న టీఎంసీ 14 చోట్ల లీడ్‌లో ఉన్నది. ఇక బీజేపీ 5, కాంగ్రెస్ 8, ఇతరులు 18 చోట్ల ఆధిక్యంలో నిలిచారు.
త్రిపురలో మొత్తం 60 స్ధానాలుండగా అధికారంలోకి రావాలంటే మెజారిటీ 31 స్ధానాలు కాగా బీజేపీ 28,సీపీఎం 19,టీఎంపీ 12 స్ధానాల్లో ఆధిక్యంలో ఉంది. నాగాలాండ్‌లో మొత్తం 60 స్ధానాలుండగా బీజేపీ 41, ఎపీఎఫ్ 4 స్ధానాల్లో ఆధిక్యంలో ఉంది. నాగాలాండ్‌లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇవి కూడా చదవండి..