యాదాద్రికి సీఎంలు..బ్రేక్ దర్శనాలు రద్దు

87
- Advertisement -

భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్‌) పబ్లిక్ మీటింగ్‌కు ఖమ్మం ముస్తాభైంది. ఈ మీటింగ్‌కు మూడు రాష్ట్రాల సీఎంలు కేరళ సీఎం పినరయి విజయన్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌ తో పాటు యూపీ మాజీ సీఎం అఖిలేష్‌ వివిధ పార్టీల నేతలు హాజరుకానున్నారు.

ఖమ్మం మీటింగ్‌లో పాల్గొనేందుకు ఇవాళ హైదరాబాద్ రానున్నారు ముగ్గురు సీఎంలు. సీఎం కేసీఆర్‌తో కలిసి రేపు(బుధవారం) యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోనున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశారు. ముగ్గురు సీఎంలు రానున్న నేపథ్యంలో ఆలయంలో నిర్వహించు నిత్య కళ్యాణం, ఆర్జీత సేవలను ,బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు ఆలయ ఈఓ గీతారెడ్డి.

యాదాద్రి దర్శనం అనంతరం ఖమ్మం చేరుకొని కంటి వెలుగు 2 కార్యక్రమంలో పాల్గొననున్నారు. అనంతరం సాయంత్రం ఖమ్మంలో జరిగే బీఆర్ఎస్ బహిరంగ సభలో పాల్గొంటారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -