తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణం కేంద్రం తెలిపింది. రాగల 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని …పలుచోట్ల తేలికపాటి నుండి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ బెంగాల్ ప్రాంతాల మీదుగా విస్తరించి ఉందని… ఈ అల్పపీడనం ప్రభావంతో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయని వెల్లడించింది. కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, మహమూబాబాద్, ఖమ్మం జిల్లాలతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ఉత్తరప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో నేడు ఉరుములు, మెరుపులతో తేలకపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ విభాగం సోమవారం ఉదయం తెలిపింది. రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో వర్షాలు ఆశాజనకంగా ఉండగా మరికొన్ని జిల్లాల్లో తీవ్రలోటు వర్షపాతం నమోదై రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపింది.