రోడ్డెక్కుడే పాపం.. ఇంటికొచ్చేదాకా నిక్కురం లేదు ఇయాల రేపు.. ఎప్పుడు ఏడ టక్కరయ్యేది తెలువది. మనం సక్కగనే పోతున్నా ఎదుటోడు యముని లెక్క ఏ సందులకేలన్నా ఉరికి రావచ్చు. ఇట్లా రోజుకు వెయ్యి నుంచి 15వందల యాక్సిడెంట్లు అయితున్నయట దేశంల. యాక్సిడెంట్లతోటి గంటకు 17 మంది పానాలు గాల్లో కలుత్తున్నయట. ఒక్కొక్క కాడ ఒక్కో తీరుగా ప్రమాదం జరుగుతుంది. గిది కూడా గసొంటిదే.. మనిషి ప్రాణం విలువైంది అని చెబితే ఎవరికి అర్ధం కాదు.. ఓ క్షణం విలువైనది చెబితే ఎవరూ అర్ధం చేసుకోరు.. కానీ ఒక్క క్షణంలో చావు నోట్లో తలపెట్టి దాని నుంచి తప్పించుకుని బతికి బయటపడ్డ వీళ్లనడిగితే ఒక్క క్షణం విలువ ఎంతో కరెక్టుగా చెబుతారు. ఎందుకంటే వీళ్లు చావునుంచి ఎట్ల తప్పించుకున్నరో చూస్తే మీకే అర్ధమయితది.
ఇంతకు ఏం జరిగిందంటే… తమిళనాడులోని మదురైలో ముగ్గురు వ్యక్తులు ఓ బైక్ పై రయ్యున పోతున్నరు. ఇంతలో మూల మలుపు రావడంతో బైక్‌ను వేరే రూట్‌కు తిప్పుతుండగా ఎదురుగా ఓ బస్ వచ్చింది. దీంతో బైక్ బస్సును ఢీకొట్టింది. బైక్ బస్సు ఒకదానికి ఒకటి ఢీకొనడంతో బైక్‌పై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులు ఎగిరి బస్సు కింద పడ్డారు. బైక్‌తో సహా ఆ ముగ్గురు వ్యక్తులను బస్సు కొంత దూరం పాటు ఈడ్చుకెళ్లింది. ఈ యాక్సిడెంట్‌ను కళ్ల నిండా చూస్తున్నవాళ్లు ఆ ముగ్గురి మీది నుంచి బస్సు వెళ్లిపోయిందని, ఆ వ్యక్తులు మరణించారని అనుకున్నారు. కానీ బస్సు డ్రైవర్ చాకచక్యంతో బ్రేక్ వేయడంతో బస్సు ముందు టైర్ సరిగ్గా ఆ వ్యక్తుల దగ్గరికి వచ్చి ఆగింది. ఇంకో క్షణం బస్సు అట్లనే ముందుకు కదిలితే ఆ ముగ్గురి ప్రాణాలు గాలిలో కలిసేవే. కానీ వాళ్లు లేచిన గడియ మంచిగున్నట్టుంది. చిన్న చిన్న దెబ్బలతో బతికి బయటపడ్డరు. ప్రస్తుతం ఈ యాక్సిడెంట్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ యాక్సిడెంట్ ఎలా జరిగిందో మీరు కూడా కింది వీడియోలో చూడండి.
#WATCH: Dramatic visuals of 3 men miraculously surviving in Madurai after they came under the wheels of a moving bus belonging to #TamilNadu State Transport Corporation. Bikers were reportedly in an inebriated state. They were admitted to hospital with minor injuries. (16.09.18) pic.twitter.com/1zY621LZlr
— ANI (@ANI) September 22, 2018