- Advertisement -
దేశరాజధాని ఢిల్లీ పరిసరాల్లో స్వల్ప భూకంపం వచ్చింది. ఢిల్లీలో భూ ప్రకంపనలు ప్రజల్ని భయబ్రాంతులకు గురిచేశాయి. ఇప్పటికే ఓ వైపు కరోనా మహమ్మారితో భయంతో గజగజ వణికిపోతుంటే.. ప్రకృతి ఇలా భూకంపం రూపంలో మరోసారి వణికించింది.
ఒక్కసారిగా భూ ప్రకంపనలు రావడంతో.. ఇళ్లలో నుంచి ప్రజలు రోడ మీదకు పరుగులు పెట్టారు. అయితే ఎవరికి ఎలాంటి నష్టం జరగలేదని తెలుస్తోంది. ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలో సంభవించిన ప్రకంపన తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 3.5గా నమోదైంది. తూర్పు ఢిల్లీలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.
- Advertisement -