నట ప్రపూర్ణ మంచు మోహన్ బాబు కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ సినిమాల్లో ఒకటి రౌడి గారి పెళ్లాం. సరిగ్గా 28 సంవత్సరాల క్రితం అంటే 1991లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల ఆదరాభిమానాలను పొందింది. 1989లో వచ్చిన తమిళ చిత్రం పుదియ పాదైకి రీమేక్‌గా తెరకెక్కగా కెఎస్ ప్రకాష్ రావు దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకంపై మోహన్ బాబు నిర్మించారు.
మోహన్ బాబు స్థానిక అవినీతి రాజకీయ నాయకుడికి అనుచరుడిగా ఉంటూ చిన్నచిన్న నేరాలు చేసే వీధి రౌడీ. తన భార్య కారణంగా మంచి మనిషిగా ఎలా మారాడు అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కగా రాంబాబుగా మోహన్ బాబు,అంజలిగా శోభన నటన అదుర్స్. మిగితా పాత్రల్లో నర్రా వెంకటేశ్వరరావు,కోట శ్రీనివాసరావు,అంజలి అన్నయ్యగా ప్రసాద్ బాబు,అన్నపూర్ణ,బ్రహ్మానందం,రజిత,హేమ ఇతర పాత్రల్లో నటించారు.
మోహన్ బాబు నటన, డైలాగ్‌లతో పాటు ఎస్పీ బాలసుబ్రమణ్యం,ఏసుదాసు పాటిన యమా రంజు, కుంతీ కుమారి,బోయవాని వేటకు పాటలు ఇప్పటికి ఎవర్ గ్రీన్ హిట్టే. సరిగ్గా ఈ సినిమా విడుదలై 28 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా మోహన్ బాబుకు విషెస్ చెబుతున్నారు ఫ్యాన్స్.